అఖిల భారత వెలమ సంఘం
డా॥ క్రిష్ణమనేని పాపారావు (పాపన్న) సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు గ్రామ వాస్తవ్యులు. వీరి తల్లిదండ్రులు
▸ శ్రీమతి విజయ, స్వర్గీయ క్రిష్ణమనేని వెంకట రామారావు గార్లు. - సిద్దిపేట, సంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.
▸ 1992 లో గుల్బర్గా విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్, జెఎన్ యూ నుండి ఎం.టెక్ పూర్తి చేశారు. ప్రముఖ విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి పట్టా పొందారు.
▸ 1993 లో పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నియమించబడ్డారు.
▸ అమెరికాలో ఉద్యోగం చేసి ఎంతో మందికి విద్య, ఉపాధి కోసం సహకారం అందించారు. నీటిపారుదల శాఖలోని వివిధ విభాగాల్లో సేవలందించారు.
▸ ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల శాఖలోని తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా నియమించబడ్డ తర్వాత నాటి ప్రభుత్వ పెద్దలను ఒప్పించి న్యాయం చేకూర్చగలిగారు.
▸ 2005లో డిపార్ట్మెంటల్ బదిలీ ద్వారా రవాణాశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు.
▸ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారి నాయకత్వంలో పని చేశారు.
▸ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘాన్ని స్థాపించి ఫౌండర్ సెక్రటరీగా ఉంటూ సంయుక్త కార్యాచరణ కమిటీ ద్వారా నాడు ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతని వివరిస్తూ రాష్ట్రం మొత్తం పర్యటించారు.
▸ మహామహులు ప్రయత్నించినా సాధ్యంకాని తెలంగాణ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ 2012లో స్థాపించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టి పురపాలక శాఖమంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.
▸ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత 2016లో ప్రాంతీయ రవాణా శాఖాధికారిగా పదోన్నతి పొందారు. 2019లో ఉప రవాణా కమీషనర్ గా మళ్ళీ పదోన్నతి పొందారు.
▸ పిల్లలకు రోడ్డు నియమాలు, ట్రాపిక్ రూల్స్ సంబంధించిన పరిజ్ఞానాన్ని కలిపించాలనే సదుద్దేశంతో దాదాపు 2 కోట్ల వ్యయంతో కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ నందు వారి నాన్నగారి జ్ఞాపకార్ధంగా స్వర్గీయ క్రిష్ణమనేని వెంకట రామారావు చిల్డ్రెన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును నెలకొల్పడం జరిగింది.
వీరి స్వగ్రామం రాజన్న సిరిసిల్లా జిల్లాలోని నేరెళ్ల. ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు. శ్రీ శ్రీనివాస్ రావు గారి సతీమణి శ్రీమతి కొండపల్లి హరిత. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు తాండ్ర సాత్విక్ అమెరికాలో ఎంఎస్ చేస్తుండగా, కుమార్తె తాండ్ర సరయు మల్లారెడ్డి మెడికల్ కాలేజీ లో మెడిసిన్ చదువుతున్నది. ప్రస్తుతం తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్లో లో డిప్యూటీ ఛీప్ రిలేషన్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. గతంలో ఐసిఐసిఐ ఏరియా మేనేజర్ గా పని చేశారు. గతంలో లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు. ఐవాలో రెండు సార్లు కార్యవర్గ సభ్యుడిగా, ఒకసారి ఆర్గనైజింగ్ సెక్రటరీ గా బాధ్యతలు నిర్వర్తించారు. జెవిఆర్ హాస్టల్ కన్వీనర్. విద్యాదాన నిధికి చైర్మెన్ గా పని చేశారు. వెలమ సమాజంలోని పేద విద్యార్థులకు వాన (వెలమ అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా), ఓవా (ఓవర్సీస్ వెలమ అసోసియేషన్) సహాయ సహకారంతో విద్యార్థి దత్తత కార్యక్రమం ద్వారా సహా యాన్ని అందించారు.
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, పైడిమడుగు వాస్తవ్యులు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. బద్రుకా కాలేజీలో గ్రాడ్యువేషన్ పూర్తి చేశారు. 2013- 2018 వరకు ఐవాకి ఈసీ సభ్యుడిగా సేవలు అందించారు. శ్రీశైలం సబ్ కమిటీ కన్వీనర్ గా బ్రహ్మనాయుడు బ్లాక్, VIP కాటేజీలు శంకుస్థాపన దగ్గరినుంచి పూర్తి వినియోగంలోకి తెచ్చే వరకు నిర్విరామ కృషి చేశారు.
M.Sc వృక్షశాస్త్రం, సైకాలజీ, MA ఇంగ్లీష్, MSW & B.Ed లాంటి ఉన్నత విద్యలు అభ్యసించారు. వృత్తిరీత్యా ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్ కి డైరెక్టర్ గా పని చేస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు ఖమ్మంలోని పేరుగాంచిన పాఠశాల, ఇంటర్ కళాశాలకు ప్రిన్సిపాల్ గా పని చేశారు. గతంలో ఐవా మహిళా సబ్ కమిటీ మెంబర్గా, ఐవా హైదరాబాద్ గర్ల్స్ హాస్టల్ కన్వీనర్ గా పని చేశారు. ఖమ్మం జిల్లా పద్మ నాయక వెలమ అసోసియేషన్ ఈసీ మెంబర్ గా వెలమ సమాజానికి సేవలు అందించారు.
కరీంనగర్ జిల్లా, ధర్మారం మండలం, బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో స్వర్గీయ పూస్కూరు దామోదర్ రావు-ఆనందమ్మ దంపతులకు అయిదవ సంతానంగా 1968 లో జన్మించిన శ్రీ పూస్కూరు శ్రీకాంత్ రావు ఉన్నత విద్యావంతులు. కరీంనగర్లో ఇంటర్మీడియెట్, మహారాష్ట్రలో బి.టెక్ పూర్తి చేశారు. హైదరా బాద్లో బిజినెస్ మెనేజ్మెంట్లో పిజి డిప్లొమా చేశారు. సాఫ్ట్వేర్ రంగంలో నిష్ణాతులైన వీరు టెక్నిక్స్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నడుపుతున్నారు. నాటి రాష్ట్ర వెలమ సంఘంలో కార్యవర్గ సభ్యునిగా సేవలందించిన వీరు 2013-15లో కార్యనిర్వాహక కార్యదర్శిగా, గత కమిటీలో ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.
వీరు పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలం, మేడిపల్లి గ్రామానికి చెందిన శ్రీ పురుషోత్తం రావు, శ్రీమతి భాగ్యలక్ష్మి గార్ల కుమారుడు. ఎంబిఏ పూర్తి చేసి.. ప్రస్తుతం సురభి హోటల్స్ డైరెక్టర్గాగా పని చేస్తున్నారు. 2013-15, 2015-18 ఐవా ఎన్నికలలో ఈసీ సభ్యుడిగా అత్యధిక మెజారిటీ తో రెండు సార్లు గెలుపొందారు. 2013 నుండి 2018 వరకు విద్యాదాన నిధి కన్వీనర్గా పని చేశారు. వీరి సతీమణి శ్రీమతి స్రవంతి. ఈ దంపతులకు ఇక కుమారుడు హృదయ్ ఉన్నారు.
స్వర్గీయ రామారావు, కమలమ్మ గార్ల కుమారుడు వీరు. వీరి సతీమణి శ్రీమతి వనిత. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీకరి. శార్వరిలున్నారు. సాయి మారుతి కన్స్ట్రక్షన్స్ మెనేజింగ్ పార్ట్నర్ గా చేసి 32 ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నారు. ప్రస్తుతం డివైన్ హెూమ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. బౌరంపేటలోని వి.ఎన్.ఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్ కి సబ్ కమిటీ సభ్యుడిగా సేవాకార్యక్రమాల్లో ఉన్నారు. ఐవా మాజీ అధ్యక్షులు స్వర్గీయ వడ్డేపల్లి నర్సింగ రావు గారి సోదరుడు.
పాత్పైండర్ విద్యాసంస్థల సెక్రెటరీ, కరెస్పాండెంట్ గా ఉన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320F కి ఈ సంవత్సరం మొదటి వైస్ చైర్మన్ గా ఉన్నారు. TRSMA వరంగల్ జిల్లా అధ్యక్షుడు. ప్రస్తుత ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఈసీ మెంబర్ గా ఉన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు, ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1997 నుండి పాత్ండర్ ఎంట్రన్స్ కాలేజీ ద్వారా చాలా మంది విద్యార్థులు స్టేట్ ర్యాంకులు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, SI, గ్రూప్-2 ఉద్యోగాలు పొందారు.